BIGG BOSS విన్నర్ అతడే.. పోల్స్‌లో దూసుకెళ్లిన కంటెస్టెంట్ !

by Anukaran |   ( Updated:2021-12-18 00:55:49.0  )
Bigg Boss
X

దిశ, వెబ్‌డెస్క్ : వంద రోజులుగా ప్రేక్షకులను ఎంతగానో అలరించిన బిగ్ బాస్ సీజన్ 5 ముగింపు దశకు చేరకుంది. 19 కంటెస్టెట్స్‌తో ప్రారంభమైన బిగ్ బాస్ షో‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ వారంతో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరో కూడా తెలిసిపోనుంది. కప్పు గెలవాలని 19 మంది ఎంతో ఆశగా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టారు. ఆటల్లో, వినోదంలో టఫ్ ఫైట్ ఇస్తూ వచ్చినా ప్రతి వారం ఒకరు ఎలిమినేట్ అవ్వాల్సిందే. ఇలా ఆడియన్స్ మనసు గెలుచుకున్న ఐదుగురు మాత్రం ప్రస్తుతం ఫైనలిస్ట్‌లుగా బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నారు. అయితే ఈ ఐదుగురిలో టైటిల్ ఎవరిదీ అనేదానిపై ఇప్పుడు అందరిలో ఆతృత నెలకొంది. బిగ్ బాస్ విన్నర్ ఎవరు అవుతారంటూ రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. కాగా, కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ నిర్వహించిన సర్వే, ఇతర చర్చలను బట్టి చూస్తే బిగ్ బాస్ విన్నర్ సన్నీ అని తెలుస్తోంది. ఓటింగ్ లో 34 శాతం ఓట్లతో సన్నీ తొలి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో షన్ముఖ్ (31), శ్రీరామచంద్ర (20), మానస్ (8), సిరి (7) ఉన్నారు. అయితే ఈ ఓటింగ్ అనేది సోషల్ మీడియాలో ట్రేండ్ అవుతున్నది కానీ ఇందులో నిజం ఎంత ఉంది అంటే రేపటి వరకు ఆగాల్సిందే.

సన్నీ విన్నర్..

మొదటి నుంచి హౌస్‌లో సన్నీ మంచి కామెడీ చేస్తూ.. స్నేహానికి విలువనిస్తూ.. ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు. అంతే కాకుండా తన కామెడీ అంటే ఇష్టపడే వారు ఎందరో ఉన్నారు. బిగ్ బాస్ హౌస్‌లో తాను చేసిన కామెడీ అంతా ఇంతా కాదు మరీ.. ఇక ఆటల్లో కూడా ఉగ్రరూపం ధరిస్తాడు సన్నీ. కానీ హౌస్‌లో సన్నీకి బిగ్ బాస్ నుంచి ఏ గిఫ్ట్ వచ్చినా ఏ హౌస్ మెంట్ అంత ఇష్టపడే వారు కాదు. అంత వ్యతిరేకత ఉన్నప్పటికీ సన్నీ తన సున్నితమైన మనస్సుతో అందరినీ ఆకట్టుకున్నారు. దీంతో బయట ఆడియన్స్ మనసును కూడా గెలుచుకున్నారు. అందువలన ఈ సీజన్ విన్నర్ సన్నీ అంటూ పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాలి.

Advertisement

Next Story