- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మచిలీపట్నం సెంట్రల్ బ్యాంకులో భారీ కుంభకోణం
కృష్ణా జిల్లా మచిలీపట్నం సెంట్రల్ బ్యాంక్‌లో భారీ కుంభకోణం వెలుగు చూసింది. రోల్డ్ గోల్డ్ నగలతో దాదాపు రూ.6.71కోట్ల కుంభకోణం చేసి బ్యాంకు అప్రైజర్ ఖాతాదారులను మోసం కొట్టించాడు. బ్యాంక్‌లో కొత్త అకౌంట్లు ఓపెన్ చేసి గోల్డ్ లోన్లను స్వాహా చేశారు. దాదాపు 500 మంది ఖాతాదారుల పేరుతో రోల్డ్‌గోల్డ్ తాకట్టుపెట్టిన అప్రైజర్ లక్షల్లో బ్యాంక్‌కు టోపీపెట్టాడు. అనుమానం వచ్చిన మేనేజర్ నగలను తనిఖీ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నగలు సరిచూసుకోవాలని మేనేజర్ విజ్ఞప్తి చేయడంతో ఆందోళనతో ఖాతాదారులు బ్యాంకుకు క్యూ కట్టారు. 68 గోల్డ్‌లోన్ ఖాతాల్లోకి నగదు జమ చేశారు. ఖాతాదారులకు తెలియకుండా వారి అకౌంట్లతో లోన్ తీసుకున్నారు. బ్యాంకు సిబ్బందితో కలిసే అప్రైజర్ సత్యవరప్రసాద్ ఈ మోసానికి పాల్పడ్డాడు. రీజనల్ మేనేజర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
tags : Big scam, central bank machileepatnam, krishna dist, gold loan, Apraijar, 500 clients, 6.71crore