- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ట్రంప్ విధించిన హెచ్-1బీ బ్యాన్‌కు బైడెన్ స్వస్తి!
వాషింగ్టన్: రిపబ్లికన్ నేత, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాత్కాలిక విదేశీ ఉద్యోగుల వీసాలపై విధించిన నిషేధాన్ని ప్రస్తుత దేశాధ్యక్షుడు జో బైడెన్ ఎత్తేయనున్నట్టు సమాచారం. తక్కువ వేతనాలకే పనిచేసే విదేశీ వర్కర్లతో అమెరికన్లకు ముప్పు పొంచి ఉన్నదని, దేశంలో నిరుద్యోగిత పెరిగే ప్రమాదమున్నదని డొనాల్డ్ ట్రంప్ తరుచూ చెబుతుండేవారు. ఇందుకు అనుగుణంగా హెచ్-1బీ వీసాలపై 2020 జూన్‌లో నిషేధం విధించారు.
ఈ నిషేధాన్ని మార్చి 31 వరకు అంటే తాను అధ్యక్ష పదవి నుంచి దిగిపోతున్నంత వరకు రెన్యువల్ చేశారు. తాజాగా, ఈ నిషేధం ఈ రోజుతో ముగియనుంది. అయితే, ప్రస్తుతం అధికారంలో ఉన్న డెమోక్రటిక్ లీడర్ జో బైడెన్ ఈ నిషేధం ఎక్స్‌పైర్ అవ్వడానికి అవకాశమిస్తున్నట్టు ఈ విషయంపై అవగాహన ఉన్న ముగ్గురు అధికారులు వివరించారు. ట్రంప్ తీసుకున్న పలు ఇమ్మిగ్రేషన్ విధానాలను ఇప్పటికే బైడెన్ వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. గ్రీన్ కార్డు ధరఖాస్తులపై విధించిన ఆంక్షలనూ ఆయన సడలించారు. తాజాగా, హెచ్-1బీ వీసాలపై నిషేధానికీ ఆస్కారమిస్తున్నారు.