కేసీఆర్ మాటల్లో నిరాశ, నిస్పృహలు: భట్టి

by Shyam |
కేసీఆర్ మాటల్లో నిరాశ, నిస్పృహలు: భట్టి
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల్లో నిరాశ, నిస్పృహలు స్పష్టంగా కనిపిస్తున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల్లో ఉండి, వారి సమస్యలు తెలుసుకొని ప్రభుత్వాన్ని ఎండగట్టడమే తన పని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం చేసినప్పటికీ ఒక్క ఎకరానికి కూడా నీరు అందలేదని విమర్శించారు. ‘కాళేశ్వరానికి చేసిన ఖర్చు ఎంత? ఇచ్చిన నీళ్లు ఎన్ని? అన్న విషయంపై దర్యాప్తు చేసేందుకు సిద్ధమా? అంటూ భట్టి కేసీఆర్‌కు సవాల్ విసిరారు. సాగర్‌తో కేసీఆర్ పతనం ప్రారంభమైందని.. భారీ మెజారిటీతో కాంగ్రెస్ గెలవబోతోందని భట్టి జోష్యం చెప్పారు. కేంద్రానికి భయపడి తెలంగాణ ప్రయోజనాలను సీఎం తాకట్టు పెట్టారని.. రైతుల పక్షాన నిలబడాల్సింది పోయి.. మోడీ పక్కన చేరడం ఏంటని నిలదీశారు. ప్రజలు తిరుగుబాటు చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆయన తెలంగాణ ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు.

Advertisement

Next Story

Most Viewed