- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈటల కాంగ్రెస్‌లోకి రావడం ఊహాజనితం: భట్టి విక్రమార్క
దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ, టీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రజలను మోసం చేసేందుకు ఆ రెండు పార్టీలు ఒకటిగా మారాయన్నారు. కావాలనే ఈటల కాంగ్రెస్‌లోకి వస్తున్నారని టీఆర్ఎస్ ప్రచారం చేస్తుందని, అది ఊహాజనితమేనని ఆయన కొట్టిపారేశారు. శనివారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ.. గాంధీ భవన్‌లో గాడ్సేలు ఉన్నారని మంత్రి కేటీఆర్ఎ లా? చెబుతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ భావజాలం ఉన్న వాళ్లు మాత్రమే తమ పార్టీ కార్యాలయంలో ఉంటారన్నారు. హుజూరాబాద్ ప్రజలు టీఆర్ఎస్‌ను ఓడించాలని కంకణం కట్టుకున్నట్టు ఆయన జోస్యం చెప్పారు. విద్యార్థి నాయకుడిగా వెంకట్ చాలా ఏళ్లుగా యువత, విద్యార్థుల కోసం గట్టిగా పోరాటం చేస్తున్నారన్నారు. అలాంటి వ్యక్తి వెంకట్‌ను శాసనసభకు పంపించాలని హుజూరాబాద్ ప్రజలు ఆలోచిస్తున్నట్లు భట్టి వివరించారు.