- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారతీ టెలీమీడియా వాటా ఎయిర్‌టెల్ సొంతం!
by Harish |
X
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ టెలికాం దిగ్గజ సంస్థ భారతీ ఎయిర్‌టెల్, డీటీహెచ్ విభాగమైన భారతీ టెలీమీడియాలో 20 శాతం వాటాను మళ్లీ సొంతం చేసుకోనున్నట్టు తెలిపింది. ప్రైవేట్ ఈక్విటీ సంస్థ వార్‌బర్గ్ పింకస్ 20 శాతం వాటాను రూ. 3,126 కోట్లకు కొనుగోలు చేయడానికి ఎయిర్‌టెల్ సిద్ధంగా ఉంది. 2018లో వార్‌బర్గ్‌ను చెందిన లియన్ మెడో ఇన్వెస్ట్‌మెంట్ సంస్థకు ఈ వాటాను విక్రయించింది. దీనికోసం అప్పట్లో రూ. 2,310 కోట్లను పొందింది. తాజాగా, టెలీమీడియాలో ఈ వాటాను ఈక్విటీ జారీ, నగదు చెల్లింపుల ద్వారా తిరిగి సొంత చేసుకోనున్నట్టు ప్రకటించింది. దీనికొసం షేర్‌కు రూ. 600తో మొత్తం 3.6 కోట్ల షేర్లను వార్‌బర్గ్‌కు ఇవ్వనుంది. దీంతోపాటు రూ. 1,038 కోట్ల నగదును చెల్లిస్తుంది. కాగా, భారతీ అనుబంధ డీటీహెచ్ వ్యాపారం గతేడాది చివరి నాటికి 1.7 కోట్ల చందాదారులను కలిగి ఉంది.
Advertisement
Next Story