రేపు భారత్ బంద్.. మార్కెట్లు, షాపింగ్ మాల్స్ క్లోజ్

by Shamantha N |
రేపు భారత్ బంద్.. మార్కెట్లు, షాపింగ్ మాల్స్ క్లోజ్
X

దిశ, వెబ్ డెస్క్ : రైతు సంఘాలు పిలుపు మేరకు రేపు(శుక్రవారం) భారత్‌ బంద్‌ జరగనుంది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 12 గంటల పాటు ఈ బంద్‌ కొనసాగుతుందని సంయుక్త కిసాన్‌ మోర్చా నేతలు పేర్కొన్నారు. రైలు, రోడ్డు రవాణా సర్వీసులను నిలిపివేయాలని రైతు సంఘాల నేతలు నిర్ణయించారు.

దీంతో దేశంలోని పలు ప్రాంతాల్లో రైలు, రోడ్డు రవాణా సర్వీసులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే, మార్కెట్లు, షాపింగ్‌ మాల్స్‌ సైతం మూసివేయాలని రైతు నాయకులు పిలుపునిచ్చారు. బంద్‌ను శాంతియుతంగా నిర్వహించి తమకు మద్దతుగా నిలవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అంబులెన్స్‌, అత్యవసర సేవలు మినహా అన్నింటినీ అడ్డుకుంటామని స్పష్టం చేశారు.

రేపటి భారత్ బంద్‌కు కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, టీడీపా, వైసీపీ, సీపీఎం, సీపీఐ సహా పలు రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. దీంతో పలు రాష్ట్రాల్లో సాధారణ జనజీవనంపై ప్రభావం పడే అవకాశం ఉంది.

Advertisement

Next Story