నేడు భారత్ బంద్..

by Shamantha N |
Bharat Bandh
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో నిరాటకంగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు, జీఎస్టీ నియమాల్లో మార్పులు, ఈ-వే బిల్లుంగ్‌లకు నిరసనగా అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య శుక్రవారం దేశవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చాయి. దేశవ్యాప్తంగా ఇంధన ధరలు ఒకేలా ఉండాలని, 40,000 సంఘాలు ఈ బంద్‌లో పాల్గొంటాయని సీఏఐటీ గురువారం ప్రకటించింది. ఈ బంద్‌లో లారీ యజమానుల సంఘం, అఖిల భారత రవాణా సంక్షేమ సంఘం కూడా పాల్గొననున్నట్లు కార్మిక సంఘాలు వెల్లడించాయి. దేశంలోని 1500 ప్రాంతాల్లో ఈ బంద్ కొనసాగనుంది. బంద్ నేపథ్యంలో ఇవాళ అన్ని వాణిజ్య మార్కెట్లు మూసి ఉంటాయని సీఏఐటీ తెలిపింది. 40లక్షల వాహనాలు నిలిపివేస్తామని వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed