- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భజన తండాకు అస్వస్థత
దిశ, మహబూబాబాద్ : మహబూబాబాద్ మండలం అయ్యోధ గ్రామ పంచాయతీ పరిధిలోని భజన తండాలో జనాలు వరుసగా అస్వస్థతకు గురవుతున్నారు. గడిచిన వారం రోజుల్లో దాదాపు 117మంది ఆస్పత్రి పాలయ్యారు. వాంతులు, కడుపులో నొప్పి, తీవ్ర మైన విరోచనాలతో బాధపడుతున్నారు. దీనిపై వెంటనే స్పందించిన జిల్లా వైద్య యంత్రాంగం తండాలో వైద్య శిబిరం ఏర్పాటు చేసింది. కొంతమందిని జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించి బాధితులకు వైద్యం అందజేస్తున్నారు. అయితే ఎవ్వరికి ప్రాణహాని లేదని వైద్యులు చెబుతున్నారు. మొదట నీరు కలుషితం కావడం వల్లనే తండావాసులు అనారోగ్యం బారిన పడుతున్నట్లుగా వైద్యులు అనుమానించారు.
తండాలోని బావుల్లోని, నల్లా నీటి శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపారు. అందులో ఎలాంటి కలుషితం లేదని, శుభ్రమైన నీరేనని తేలిందని వైద్యులు చెబుతున్నారు. భజన తండా వాసులు పండించిన టమాట, పచ్చి మిర్చి శాంపిళ్లను వ్యవసాయ అధికారి సూర్యనారాయణ సేకరించి పరీక్ష కేంద్రానికి పంపారు. ఇంకా రిపోర్ట్ అందాల్సి వుంది. దాదాపుగా అతిగా ఫెస్టిసిడ్స్ వాడి పండించిన టమాట, పచ్చి మిర్చి ఉపయోగించడం మూలంగానే తండావాసులు అస్వస్థతకు గురై వుంటారని వైద్యులు భావిస్తున్నారు. శాంపిల్స్ ఫలితాలు వచ్చే వరకు నిర్ధారణ చేయలేము అని వైద్యాది కారులు తెలియ జేస్తున్నారు.