- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ ఆలోచనే భయపెడుతుంది : భాగ్య శ్రీ
భాగ్య శ్రీ..’మైనే ప్యార్ కియా’ సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన నటించింది. చేసింది కొన్ని సినిమాలే అయినా..ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించింది. ఇప్పటికీ తనని ‘మైనే ప్యార్ కియా’ భాగ్యశ్రీగానే ఆడియన్స్ గుర్తుపెట్టుకున్నారంటే అతిశయోక్తి కాదు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అయిన ఈ సినిమాలో సల్మాన్, భాగ్యశ్రీ జోడీకి దేశం మొత్తం ఫిదా అయింది. కానీ ఈ సినిమా తర్వాత ఆమె వెంటనే పెళ్లి చేసుకుంది. కెరియర్ మంచి టర్నింగ్ పాయింట్ తీసుకుంటున్న సమయంలో మ్యారేజ్ చేసుకోవడాన్ని చాలా మంది రాంగ్ డెసిషన్ అన్నారట. కానీ భాగ్యశ్రీ అవేవీ పట్టించుకోకుండా పెళ్లికే ఓటేసింది.
వ్యాపారవేత్త అయిన హిమాలయ దసానిని 1990లో లవ్ మ్యారేజ్ చేసుకుంది భాగ్య శ్రీ. ఇంట్లో ఒప్పుకోకపోయినా సరే కొద్ది మంది స్నేహితుల మధ్య ఓ గుడిలో తనను వివాహమాడింది. అయితే తమ 30 ఏళ్ల వివాహ బంధంపై భాగ్యశ్రీ ఉద్వేగానికి లోనయ్యారు. భర్తతో కలిసి లేని ఏడాదిన్నర రోజులు చాలా భారంగా గడిచాయని తెలిపింది. ఆ సమయంలో తనను పెళ్లి చేసుకోకుండా మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఏం జరిగి ఉండేది? అనే ఆలోచన వచ్చిందని..ఆ ఆలోచన చాలా భయపెట్టిందని చెప్పింది. ఆ విషయం గుర్తుకు వస్తే ఇప్పటికీ భయమేస్తుందని తెలిపింది. కాగా ఈ వీడియో సోషల్ మీడియాలో ఫుల్‌గా వైరల్ అయిపోయింది. కాగా భాగ్య శ్రీ ప్రభాస్ 20వ మూవీ ‘ఓ డియర్’లో నటిస్తోంది. బాహుబలికి తల్లిగా నటించడం గర్వంగా ఉందని .. ఈ ఛాన్స్ ఎవరు మాత్రం కాదనుకుంటారంటూ ఆనందం వ్యక్తం చేసింది.