- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Salman Khan: సల్మాన్‌ను కిస్ చేయడం కంఫర్ట్ అనిపించలేదు : హీరోయిన్ భాగ్య శ్రీ
దిశ, సినిమా : సల్మాన్ ఖాన్- భాగ్యశ్రీ జంటగా నటించిన ‘మైనే ప్యార్ కియా’ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపడ్డాయి. ఈ చిత్ర షూటింగ్‌లో భాగంగా సల్మాన్‌ను ముద్దుపెట్టుకునేందుకు భాగ్యశ్రీ ఎందుకు నిరాకరించిందో వెల్లడించింది. ఈ వారం ప్రసారం కానున్న జీ కామెడీ షోకు స్పెషల్ గెస్ట్‌గా హాజరైన పాపులర్ బాలీవుడ్ యాక్ట్రెస్ భాగ్యశ్రీ అప్పటి విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది. షోలో కమెడియన్స్ చేసిన హిలేరియస్ స్కిట్స్ ప్రతీ ఒక్కరిని నవ్వించగా.. భాగ్యశ్రీ చెప్పిన సీక్రెట్స్ మరింత ఆసక్తిని కలిగించాయి. ‘మైనే ప్యార్ కియా’కు సంబంధించిన ఓ సాంగ్ చిత్రీకరణలో తను సల్మాన్‌ను కౌగిలించుకునే సీక్వెన్స్ ఉందని తెలియడంతో ఏడ్వటం మొదలుపెట్టానని, అయితే సల్మాన్ కన్విన్స్ చేయడంతో సీక్వెన్స్ కంప్లీట్ చేశానని తెలిపింది.
ఆ సంఘటన జరిగినపుడు తనకు 18 ఏళ్లు మాత్రమే ఉండగా.. ప్రేమించినవాన్ని పెళ్లిచేసేందుకు సిద్ధమవుతున్నాని, పైగా అప్పటివరకు ఏ అబ్బాయిని కౌగిలించుకోలేదని చెప్పింది. ఇక మరొక సన్నివేశంలో సల్మాన్, భాగ్యశ్రీ ముద్దు పెట్టుకోవాల్సిన సన్నివేశం ఉందట. కానీ తన పరిస్థితి చూసిన తర్వాత ఆ మొత్తం సీక్వెన్స్‌ను ఇద్దరి మధ్య గ్లాస్ పెట్టి చిత్రీకరించారని గుర్తుచేసుకుంది.