- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రపంచంలో ఉత్తమ విస్కీ.. జపాన్ సింగిల్ మాల్ట్
దిశ, వెబ్‌డెస్క్: ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా విస్కీ మేగజైన్ వారు ప్రపంచంలో వివిధ విస్కీ బ్రాండ్లకు తయారీ సంస్థలకు అవార్డులు ప్రకటించారు. కానీ కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా ఈ ఏడాది ఎలాంటి వేడుక నిర్వహించకుండా ఫేస్‌బుక్ లైవ్ ద్వారా అవార్డులను ప్రకటించారు. ఈ అవార్డుల్లో ప్రపంచ ఉత్తమ సింగిల్ మాల్ట్ విస్కీగా జపాన్ విస్కీ నిలిచింది.
అలాగే ఉత్తమ బ్లెండెడ్ విస్కీగా దేవార్స్ డబుల్ డబుల్ 32 ఇయర్ ఓల్డ్ విస్కీ, ఉత్తమ బ్లెండెడ్ మాల్ట్ కేటగిరీలో మెక్ నాయర్స్ విస్కీ లమ్ రీక్ బ్లెండెడ్ స్కాచ్ విస్కీ 21 ఇయర్ ఓల్డ్ నిలిచాయి. వీటితో పాటు వివిధ కేటగిరీల్లో ఉత్తమ విస్కీలకు విస్కీ మేగజైన్ సత్కారం చేసింది. దీనికి న్యాయనిర్ణేతలుగా వహించిన వారికి కళ్లకు గంతలు గట్టి విస్కీలను ఒక్కొక్కటిగా రుచి చూపిస్తారు. వాటికి కేటాయించిన అంకెల ఆధారంగా చక్కని రుచి ఉన్న విస్కీని న్యాయనిర్ణేతలు గుర్తించాల్సి ఉంటుంది.
Tags : Whiskey, Single Malt, Whiskey Magazine, Single malt, Blended whiskey, Japan Whiskey