హీరో ఉద్యోగులకు అదిరిపోయే బెనిఫిట్స్

by Harish |   ( Updated:2021-08-25 06:35:14.0  )
హీరో ఉద్యోగులకు అదిరిపోయే బెనిఫిట్స్
X

దిశ వెబ్‌డెస్క్: ద్విచక్ర వాహన దిగ్గజ సంస్థ హీరో తమ ఉద్యోగులను బంఫర్ ఆఫర్ ప్రకటించింది. కంపెనీలో కనీసం రెండేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న ప్రతి ఉద్యోగికి అదనపు ప్రయోజనాలు కల్పించేందుకు ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. దీనిలో భాగంగా ఉద్యోగులతో పాటు, ఉద్యోగుల జీవిత భాగస్వాములకు కూడా ఫుల్ టైమ్/ పార్ట్ టైమ్ ఉద్యోగాలను కల్పించనున్నట్లు ప్రకటించింది. వీటితో పాటు వాహన రుణాలను అందించటం, అదనపు సెలవులు మంజూరు చేయటం, ఓకే వడ్డీ రేట్‌కు గృహ రుణాలను అందించటం లాంటివి ఉన్నాయని హీరో ఎలక్ట్రిక్ ఎండీ నవీన్ ముంజల్ చెప్పారు.

ఉద్యోగులకు 15 రోజుల పాటు ప్రసూతి సెలవులు, 6 నెలల వరకు నచ్చిన సమయంలో పనిచేసే అవకాశం, మొదటి మూడు నెలల్లో 10 రోజులు ఇంట్లో నుంచి పని చేసే అవకాశం, 20-25 సంవత్సరాలు ఉన్న ఉద్యోగులకు పని తీరు ఆధారంగా ఉన్నత విద్యను అభ్యసించటానికి విద్యారుణాలు, స్కాలర్ షిప్స్, పరీక్షల సమయంలో ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ కేటాయించనున్నట్లు వెల్లడించారు.

తాము ఈ రోజు ఉన్నత స్థానాల్లో ఉండటానికి కారణం ఉద్యోగుల పట్టుదల, కృషి కారణమన్నారు. గత రెండేళ్ల నుంచి ఉద్యోగులు కష్ట పడుతున్నారని కొనియాడారు. తమ అభివృద్ధికి సహకరిస్తున్న ఉద్యోగులకు సంస్థ సాయం అందిస్తుందని వివరించారు. రిటైరయిన ఉద్యోగులకు సైతం కొన్ని బెనిఫిట్స్ కల్పించనున్నట్లు తెలిపారు. హీరో హోండా విడిపోయిన తరువాత ఇరువురు తమ తమ మోడల్స్‌ను వారు విడుదల చేసుకుంటున్నారు.

Advertisement

Next Story