ఎక్స్‌టెన్షన్లతో జాగ్రత్త!

by Harish |
ఎక్స్‌టెన్షన్లతో జాగ్రత్త!
X

చూడబోతే భారత్ చైనాల మధ్య సాంకేతిక యుద్ధం ముదురుతున్నట్లుగా కనిపిస్తోంది. ఓ వైపు భారతదేశం చైనా యాప్‌లను నిషేధించడం, మరోవైపు చైనా హ్యాకర్లు దాడికి ప్రయత్నిస్తుండటం చూస్తుంటే ఇది నిజమేననిపిస్తోంది. అందుకే ఇంటర్నెట్ వాడేటపుడు చాలా జాగ్రత్తగా ఉండాలని ‘కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా’ హెచ్చరిస్తోంది. ఇప్పుడు కొత్తగా గూగుల్ క్రోమ్ ఎక్స్‌టెన్షన్‌లు ఇన్‌స్టాల్ చేసేటపుడు ఆచితూచి ముందుకెళ్లాలని సెర్ట్ ఇన్ చెబుతోంది. ఇప్పటికే 100కు పైగా హానికర జోడింపులను తొలగించినట్లు గూగుల్ ప్రకటించింది.

ఈ ఎక్స్‌టెన్షన్లు కూడా వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. గూగుల్ క్రోమ్ వెబ్‌స్టోర్ సెక్యూరిటీ స్కాన్‌లను సులభంగా బైపాస్ చేయగల కోడ్‌ను ఆ ఎక్స్‌టెన్షన్లలో క్రోమ్ కనిపెట్టింది. ఈ కోడ్ ద్వారా ఎక్స్‌టెన్షన్లు స్క్రీన్ షాట్లు తీయడం, క్లిప్ బోర్డు సమాచారం చదవడం, కీస్ట్రోకుల ఆధారంగా పాస్‌వర్డులు పసిగట్టడం వంటి పనులు చేయగలవు. అందుకే విశ్వసనీయ ఎక్స్‌టెన్షన్లను మాత్రమే ఇన్‌స్టాల్ చేసుకోవాలని సెర్ట్ సలహా ఇస్తోంది. ఉచితంగా లభిస్తూ, ఫైళ్ల ఫార్మాట్ మార్చే పర్మిషన్ కోసం అనుమతి కోరుతున్న ఎక్స్‌టెన్షన్ల నుంచి జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది.

Advertisement

Next Story