- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Trump pithin: ట్రంప్ పుతిన్ ఫోన్ సంభాషణ.. చర్చించిన అంశాలివే?

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Puthin)లు మంగళవారం ఫోన్‌లో సంభాషించారు. సుమారు రెండు గంటల పాటు ఇరువురు నేతలు మాట్లాడుకున్నట్టు వైట్ హౌస్, క్రెమ్లిన్‌లు ధ్రువీకరించాయి. ఈ సందర్భంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై చర్చించినట్టు పేర్కొన్నాయి. ఈ మేరకు ఫోన్ సంభాషణ అనంతరం ఇరు పక్షాలు వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశాయి. రష్యా, ఉక్రెయిన్‌లు 30 రోజుల పాటు ఒకరి ఇంధన మౌలిక సదుపాయాలను మరొకరు తాకకుండా ఉండాలని ట్రంప్ ప్రతిపాదించగా అందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒప్పుకున్నారని క్రెమ్లిన్ తెలిపింది. అంతేగాక రష్యన్ సైన్యానికి వెంటనే ఆదేశాలు సైతం జారీ చేసినట్టు పేర్కొంది. ఇద్దరు దేశాధ్యక్షులు ముఖ్యంగా 30 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనపైనా డిస్కస్ చేసినట్టు తెలుస్తోంది.
ఈ సంభాషణపై వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ స్పందిస్తూ.. ఉక్రెయిన్ యుద్ధంలో శాంతి, కాల్పుల విరమణ అవసరంపై ఇద్దరూ మాట్లాడుకున్నారని పేర్కొన్నారు. అమెరికా, రష్యా మధ్య మెరుగైన సంబంధాలు ఉండాలని ఇరుపక్షాలు ఆశిస్తున్నాయని తెలిపారు. ‘రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం శాశ్వత శాంతితో ముగియాలని, ఆ లక్ష్యాన్ని సాధించడానికి చర్చలు వెంటనే ప్రారంభమవుతాయని ట్రంప్, పుతిన్‌లు అంగీకరించారని పేర్కొన్నారు.