- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఫ్యామిలీ రూల్‌పై కోహ్లీ ఫైర్.. వెనక్కి తగ్గిన బీసీసీఐ?

దిశ, స్పోర్ట్స్ : విదేశీ పర్యటనల్లో భారత క్రికెటర్ల వెంట కుటుంబ సభ్యులు ఉండటంపై బీసీసీఐ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీనిపై విమర్శలు రావడంతో బీసీసీఐ వెనక్కుతగ్గినట్టు తెలుస్తోంది. టీమిండియా సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో టెస్టు సిరీస్‌లో క్లీన్‌స్వీప్ అవడం, ఆస్ట్రేలియా టూరులో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కోల్పోయిన నేపథ్యంలో బీసీసీఐ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. భారత ఆటగాళ్లకు 10 పాయింట్లతో కొత్త మార్గదర్శకాలను పంపింది. అందులో 45 రోజుల విదేశీ పర్యటనలకు మాత్రమే ప్లేయర్ల కుటుంబసభ్యులను రెండు వారాలే అనుమతించాలని తెలిపింది.
ఇటీవల బీసీసీఐ నిర్ణయంపై భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్లేయర్లతో కుటుంబ సభ్యులు ఉండాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పాడు. పేలవ ప్రదర్శన తర్వాత ఒంటరిగా కూర్చోవాలా? అంటూ అసహనం వ్యక్తం చేశాడు. బీసీసీఐ నిర్ణయాన్ని కోహ్లీ బహిరంగంగా తప్పుబట్టడంతో క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇతర క్రికెటర్లు కూడా ఈ కొత్త నిబంధన గురించి బీసీసీఐ ముందు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో దిగొచ్చిన బీసీసీఐ ఫ్యామిలీ రూల్‌ను సవరించేందుకు సిద్ధమైనట్టు క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. కుటుంబసభ్యులు ఎక్కువ కాలం ఉండాలనుకునే ఆటగాళ్లు బీసీసీఐ అనుమతి తీసుకోవాల్సిందిగా రూల్‌లో మార్పు చేయనున్నట్టు తెలిపాయి. అదే జరిగితే సుదీర్ఘ విదేశీ పర్యటనల సందర్భంగా తమ వెంట కుటుంబసభ్యులు ఎక్కువ కాలం ఉండాలనుకునే ఆటగాళ్లు బీసీసీఐ అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనిపై బోర్డు అధికారికంగా స్పందించాల్సి ఉంది.
- Tags
- BCCI
- virat kohli