పాక్ మహిళా క్రికెటర్ల మ్యాచ్ ఫీజుల్లో కోత

by Harish |
పాక్ మహిళా క్రికెటర్ల మ్యాచ్ ఫీజుల్లో కోత
X

దిశ, స్పోర్ట్స్ : పాకిస్తాన్ క్రికెట్ ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటుంది. చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) దాదాపు రూ.869 కోట్లు నష్టపోయినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పీసీబీ ఖర్చులు తగ్గించుకునే పనిలో పడింది. నేషనల్ టీ20 కప్ సందర్భంగా దేశీయ పురుష క్రికెటర్ల మ్యాచ్ ఫీజులలో 75 శాతం కోత పెట్టింది. అలాగే, ఆటగాళ్లకు వసతి, ప్రయాణ సౌకర్యాలను కూడా తగ్గించింది. దీంతో పీసీబీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. తాజాగా మహిళా క్రికెటర్ల మ్యాచ్ ఫీజులను కూడా తగ్గించినట్టు తెలుస్తోంది. దీనిపై పీసీబీ అధికారికంగా ప్రకటన చేయకపోయినా మ్యాచ్ ఫీజులు తగ్గించినట్టు పాక్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పాక్ కరెన్సీలో 25 వేల నుంచి 20 వేలకు మ్యాచ్ ఫీజు తగ్గించినట్టు తెలుస్తోంది. తక్కువ మ్యాచ్ ఫీజులు పాక్ మహిళా క్రికెటర్లు సరైన శిక్షణ, క్రికెట్ సంబంధిత ఖర్చులను కష్టతరం చేస్తాయి.


Next Story