తప్పు ఒప్పుకుంటే శిక్షించం: క్రికెటర్లకు బీసీసీఐ ఆఫర్

by Shyam |
తప్పు ఒప్పుకుంటే శిక్షించం: క్రికెటర్లకు బీసీసీఐ ఆఫర్
X

దిశ, స్పోర్ట్స్: నకిలీ జనన ధృవీకరణ పత్రాల బెడద ఇప్పుడు బీసీసీఐకి కూడా పాకింది. వయసు ఎక్కువ ఉన్నా అండర్-16, అండర్-19 జట్లలో స్థానం సంపాదించడానికి చాలా మంది యువ క్రికెటర్లు నకిలీ జనన ధృవీకరణ పత్రాలు సమర్పించినట్లు గుర్తించింది. పాకిస్తాన్‌లో ఇలాంటి మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కాగా, ఇండియాలో కూడా ఇలాంటి జిమ్మిక్కులు చేసి బోర్డును బోల్తా కొట్టిస్తున్నట్లు తెలియడంతో ఒక హెచ్చరిక జారీ చేసింది. నకిలీ జనన ధృవీకరణ పత్రాలు సమర్పించి ఆయా జట్లలో స్థానం సంపాదించిన యువ క్రికెటర్లు తమ తప్పును ఒప్పుకుంటే క్షమించి వదిలేస్తామని, అంతేకాకుండా వారిని అర్హులైన కేటగిరీలో మ్యాచ్‌లు ఆడిస్తామని స్పష్టం చేసింది. ఒక వేళ బోర్డు విచారణలో బయటపడితే మాత్రం రెండేళ్ల నిషేధంతోపాటు రాష్ట్రాల అసోసియేషన్ల తరఫున కూడా ఆడకుండా నిషేధిస్తామని హెచ్చరించింది. గత ఏడాది ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టు తరఫున ఆడిన కశ్మీర్ ఫాస్ట్ బౌలర్ రసిక్ సలామ్ టీం ఇండియా అండర్-19 తరఫున ఆడటానికి నకిలీ సర్టిఫికేట్ సమర్పించి దొరికిపోయాడు. అప్పటి నుంచి విచారణను వేగవంతం చేసిన బీసీసీఐ, ఆటగాళ్లకు చివరి అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించింది.et

Advertisement

Next Story

Most Viewed