- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీసీ కార్పొరేషన్లకు ఛైర్మన్లు, డైరెక్టర్ల జాబితా ఖరారు?
దిశ, ఏపీబ్యూరో : ఏపీలోని బీసీ కార్పొరేషన్లకు ఛైర్మన్లు, డైరెక్టర్ల నియామకానికి చెందిన జాబితా ఇవాళ ఖరారు కానున్నది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు క్యాంపు కార్యాలయంలో జరిగే సమావేశంలో సీఎం జగన్ ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నారు. ఒక్కో కార్పొరేషన్‌కు ఛైర్మన్‌తో పాటు 12 మంది డైరెక్టర్లను నియమిస్తారు. ఎంపిక కోసం రాజ్యసభ ఎంపీలు పిల్లి సుభాష్‌చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి సమన్వయ బాధ్యతలు అప్పగించారు.
ఈ ముగ్గురూ జిల్లాల వారీగా ఎంపీ, ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి, ఒక్కో నియోజకవర్గానికి ముగ్గురు డైరెక్టర్ల చొప్పున పేర్లు తీసుకున్నారు. మీటింగ్‌లో వీటిపై చర్చించి ఓ నిర్ణయం తీసుకోనున్నారు. తొలుత 52 కార్పొరేషన్లు అనుకున్నా.. కొత్తగా మరో నాలుగు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీంతో మొత్తం కార్పొరేషన్లు 56కు చేరనున్నాయి. ఈ ప్రక్రియకు సీఎం ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. పార్టీ ప్రాంతీయ బాధ్యులు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయ సాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మోపిదేవి వెంకటరమణ ఇప్పటికే ఒక్కో కార్పొరేషన్‌కు ఛైర్మన్‌గా ముగ్గురి పేర్లతో కూడిన జాబితాను తయారుచేశారు. వారిలో ఒకరి పేరును సీఎం జగన్ ఖరారు చేయనున్నారు.