కరోనాతో బతుకమ్మ టీవీ నిర్వాహకురాలు కల్పన కన్నుమూత..

by Shyam |
కరోనాతో బతుకమ్మ టీవీ నిర్వాహకురాలు కల్పన కన్నుమూత..
X

దిశ, కుత్బుల్లాపూర్ : కరోనా మహమ్మారి సీనియర్ పాత్రికేయురాలు, టీవీ నిర్వాహకురాలిని బలిగొంది. వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన కొల్ల వెంకట కల్పన(40) పెద్ద కొన్ని సంవత్సరాలుగా పాత్రికేయురాలుగా విధులు నిర్వహిస్తున్నారు. ఎనిమిది సంవత్సరాల క్రితం బతుకమ్మ టీవీ ఛానెల్‌ను స్థాపించారు. అయితే ఈ నెల 16వ తేదీన ఆమెకు కరోనా పాజిటివ్ రావడంతో సుచిత్రలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఆమెకు ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడంతో నగరంలోని ఓ ప్రముఖ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 8 గంటల తర్వాత మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న జర్నలిస్టు సంఘాల నాయకులు, ప్రభుత్వ అధికారులు ఆమె కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించారు.

Advertisement

Next Story