146 పోస్టులు ఖాళీగా ఉన్నాయి: భట్టి విక్రమార్క

by Anukaran |
146 పోస్టులు ఖాళీగా ఉన్నాయి: భట్టి విక్రమార్క
X

దిశప్రతినిధి, మహబూబ్ నగర్: పోరాడి సాధించిన తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజలకు నిరాశే మిగిలిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత కూడా ప్రజలు ఆశించినా నేటికీ ఉద్యోగాలు భర్తీ చేయడంలో ఈ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. రాష్ట్రం వచ్చి 7 సంవత్సరాలు అవుతున్నా రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలు కూడా భర్తీ చేయకపోవడం వల్ల రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందన్నారు. చివరకు సాగునీటి జలాలను ఆంధ్ర పాలకులు దండుకుపోతున్నా అడ్డుకోవడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.

సోమవారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్ర ఆసుపత్రిని సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న రాయలసీమ లిఫ్ట్ పనులు పూర్తయితే తెలంగాణ రాష్ట్రంలో సుమారు 27 లక్షల ఎకరాల భూమి భీడు భూములుగా మారుతాయని చెప్పారు. ఈ లిఫ్ట్ ను అడ్డుకోవాల్సిన తెలంగాణ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే సీఎం కేసీఆర్ పరోక్షంగా దానికి సహకరిస్తున్నట్లు కనిపిస్తుందన్నారు. మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని నేడు అప్పుల ఊబిలోకి నెట్టారని పేర్కొన్నారు.

3 లక్షల కోట్లు అప్పులు చేసిన ప్రభుత్వం ఇంత వరకు ప్రజావైద్యం కోసం ఎన్ని కోట్లు ఖర్చు చేశారని నిలదీశారు. నేడు కోవిడ్ విజృంభన కారణంగా రాష్ట్రంలో ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా వరకు ప్రభుత్వ ఆసుపత్రులో కనీస సౌకర్యాలు కూడా లేవని విమర్శలు గుప్పించారు. మహబూబ్ నగర్ ఆసుపత్రిలో 15 మంది ప్రొఫెసర్స్ ఉండాల్సి ఉండగా 6మంది మాత్రమే ఉన్నారని ఇంకా 9 పోస్టులు ఖాలీగా ఉన్నాయన్నారు. అలాగే 33 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు 19 ఖాలీలు, 45 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 15 ఖాళీలు ఇంటే కూడా ప్రభుత్వం ఎందుకు వాటిని భర్తీ చేయడం లేదన్నారు.

రోగులకు అండగా ఉండే 38 సీనియర్ రెసిడెన్స్ పోస్టులకు 30 పోస్టులు ఖాళీలు ఉంటే ప్రజలకు వైద్యం ఎలా అందుతుందని ప్రశ్నించారు. 76 జూనియర్ రెసిడెన్స్ పోస్టులకు 70 పోస్టులు ఖాళీగా ఉన్నాట్లు వివరించారు. ఎంఐసీయూ పోస్టుల విషయానికి వస్తే 6 ఉండగా 3 పోస్టులు ఖాలీగా ఉన్నాయన్నారు. మొత్తంగా మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో 213 పోస్టులు ఉండగా అందులో 146 పోస్టులు ఖాళీగా ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో భట్టితో పాటు మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్ ఇతర సీనియర్ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

Advertisement

Next Story