- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గబ్బిలాలే ఆ ఊరికి కీర్తి..!
దిశ, మహబూబాబాద్ : గ్రామ శివారులో పెద్ద పెద్ద వృక్షాలకు తలక్రిందులుగా వేలాడే గబ్బిలాల శబ్దం వింటే భయపడని వారుండరు. కేవలం రాత్రి వేళల్లో మాత్రమే సంచరించే ఈ గబ్బిలాలు ఆ ఊరి నిండా ఉండడం వల్లే అదృష్టంగా భావిస్తున్నారు ఆ గ్రామస్తులు. ఊరి మధ్యలో సుమారు 200 వందల సంవత్సరాల నుండి 5వేలకు పైగా గబ్బిలాలు చెట్లకు వేలాడుతుడడంతో గ్రామ ప్రజలు వీటిని అదృష్టంగా భావిస్తున్నారు. వివారాల్లోకి వెళ్ళితే.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కోమటిపల్లి గ్రామంలో సుమారు 150 సంవత్సరాల క్రితం బావి తవ్వుతుండగా శ్రీ లక్ష్మీ నారాయణ మూర్తి విగ్రహం బయట పడింది.అంతకు పూర్వం నుండే గ్రామంలో గబ్బిలాలు సంచరిస్తూ ఉండేవి. విగ్రహం బయటపడ్డప్పటి నుండి ఆ ప్రదేశంలో గబ్బిలాలు చేరాయి.ఆనాటి నుండి అనగా 200 ఏండ్లుగా గ్రామ సస్యశ్యామలంగా ఉంటుందని, కరువు అనేది తెలియదని గ్రామస్థులు నమ్మకం.
గబ్బిలాలు గ్రామ మధ్యలోని గుడి ప్రాగణం వద్ద నివాసం ఏర్పాటు చేసుకున్నప్పటి నుండి అంతా శుభమే కలుగుతుందని గ్రామ ప్రజలు తెలుపుతున్నారు. దీనితో పాటుగా గబ్బిలాల మలంను కీళ్ల, మోకాళ్ళ నొప్పులు కోసం వాడుతారని పలు జిల్లాల నుండి ఈ గ్రామానికి వస్తున్నట్ల గ్రామ ప్రజలు తెలుపుతున్నారు.గత మూడు సంవత్సరాల క్రితం గబ్బిలాలు ఎండ వేడిమి తట్టుకోలేక మృత్యువాతపడ్డట్లు తెలిపారు. ఈ ఏడాది చెరువుల్లో నీరుసమృద్ధిగాఉండడంతో, పంటలు బాగా పండడంతో గబ్బిలాలు సంతానం పెరిగిందని గ్రామస్థులు తెలిపారు. ఈ గబ్బిలాల కిట..కిట శబ్దం..జీవ్వుమని తిరిగే విధానమే కోమటిపల్లి గ్రామానికి అదృష్టమని గ్రామ ప్రజలు తెలుపుతున్నారు.