- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
మైదానంలో కుప్పకూలిన ఫుట్‌బాల్ ప్లేయర్
దిశ, స్పోర్ట్స్: ఎఫ్‌సీ బార్సిలోనా జట్టుకు చెందిన సెర్జియో అగురో.. మ్యాచ్ ఆడుతూనే మైదానంలో కుప్పకూలిపోయాడు. బార్సిలోనా – అలవెస్ క్లబ్స్ మధ్య మ్యాచ్ జరుగుతుండగా సెర్జియో ఛాతిపై పట్టుకొని మైదానంలో పడిపోయాడు. దీంతో మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మైదానానికి చేరుకొని సెర్జియోను పరిశీలించారు. సెర్జియోకు ఏమయ్యిందో అనే భయంతో స్టేడియంలో అతడి ఫ్యాన్స్ పెద్దగా నినాదాలు చేశారు.
అయితే సెర్జియో స్ట్రెచర్ మీద ఎక్కకుండా అక్కడి నుంచి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లి అంబులెన్స్ ఎక్కాడు. బార్సిలోనా తాత్కాలిక చీఫ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం సెర్జియో ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు చెప్పాడు. కాస్త మత్తుగా ఉన్నట్లు అతడు చెప్పాడని.. వెంటనే పారామెడిక్స్ వచ్చి అతడిని ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. అంతకు మించి తనకు ఇతర విషయాలు తెలియదని చెప్పాడు. కాగా, సెర్జియో ప్రస్తుతం ఆసుపత్రిలోని కార్డియాలజీ విభాగంలో పర్యవేక్షణలో ఉన్నట్లు తెలుస్తున్నది. ఇటీవలే సెర్జియో అగురో బార్సిలోనా క్లబ్‌తో రెండేళ్ల ఒప్పందం కుదుర్చుకున్నాడు. 10 ఏళ్ల పాటు మాంచెస్టర్ సిటీ తరపున ఆడిన సెర్జియో మొత్తం 390 మ్యాచ్‌లలో 260 గోల్స్ చేశాడు.