ఆరు సంవత్సరాల్లో రూ. 15 లక్షల కోట్ల ముద్రా యోజన రుణాలు!

by Harish |   ( Updated:2021-05-27 07:12:33.0  )
ఆరు సంవత్సరాల్లో రూ. 15 లక్షల కోట్ల ముద్రా యోజన రుణాలు!
X

దిశ, వెబ్‌డెస్క్: గత ఆరు సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వ ముద్రా యోజన పథకం కింద గణనీయంగా రుణాల మంజూరు జరిగినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఆరేళ్లలో మొత్తం 28 కోట్లకు పైగా లబ్దిదారులకు రూ. 15 లక్షల కోట్ల రుణాలను బ్యాంకులు అందజేశాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ పథకం 2015లో ప్రారంభించారు. దీని ద్వారా ఎలాంటి తనఖా లేకుండా రూ. 10 లక్షల వరకు రుణ సాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఈ పథకంలో తయారీ, సేవలు, ట్రేడింగ్, వ్యవసాయ రంగాల సంబంధిత పరిశ్రమలకు రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

శిశు విభాగంలో 2 శాతం వడ్డీ రాయితీని రుణ గ్రహీతలకు ఆత్మ నిర్భర్ ప్యాకేజీలో భాగంగా ఇవ్వనున్నట్టు గతేడాది కేంద్రం స్పష్టం చేసింది. కరోనా మహమ్మారి కారణంగా ఉత్పన్నమైన సమస్యలను పరిశ్రమలు అధిగమించేందుకు ఈ సాయం ఉపయోగపడుతుందని ప్రభుత్వం తెలిపింది. శిశు విభాగంలో తనఖా లేకుండా ఒక పరిశ్రమకు రూ. 50 వేల వరకు రుణాలు లభిస్తాయి.

Advertisement

Next Story

Most Viewed