బ్యాంకులు మూలధన క్షీణతను ఎదుర్కొంటాయి

by Harish |
బ్యాంకులు మూలధన క్షీణతను ఎదుర్కొంటాయి
X

దిశ, వెబ్‌డెస్క్: రాబోయే రెండేళ్లలో అభివృద్ధి చెందుతున్న ఆసియాలో బ్యాంకింగ్ రంగ మూలధనం క్షీణిస్తుందని, భారత్‌లోనూ ఇన్ఫ్యూజన్ కొరవడి భారీగా మూలధనం తగ్గుతుందని ప్రముఖ రేటింగ్ సంస్థ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ అభిప్రాయపడింది. ప్రస్తుతం కొవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో నిర్వహణ పరిస్థితులు సవాలుగా ఉన్నాయని, అభివృద్ధి చెందుతున్న దేశాల బ్యాంకులకు ఆస్తి నాణ్యతలో అనిశ్చితి అతిపెద్ద ముప్పుగా ఉండనుందని మూడీస్ తెలిపింది.

2021 ఏడాది బ్యాంకులపై దృక్పథం ప్రతికూలంగా ఉంటుందని, బీమా సంస్థలపై స్థిరమైన దృక్పథాన్ని చూడగలమని వెల్లడించింది. రాబోయే రెండేళ్లలో భారత్, శ్రీలంక దేశాల్లోని బ్యాంకులు భారీగా మూలధన క్షీణతను వెల్లడిస్తాయి, లేదంటే ప్రైవేట్ సంస్థల నుంచి సమీకరణకు సిద్ధమవుతాయని మూడీస్ పేర్కొంది. అంతేకాకుండా, దేశీయ బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలలో ఒత్తిడి కారణంగా అవి రుణాలిచ్చే సామర్థ్యాన్ని కోల్పోతాయని మూడీస్ అభిప్రాయపడింది. అలాగే, రుణాల పనితీరు మెరుగైన స్థితిలో లేని కారణంగా బ్యాంకుల నిరర్ధక రుణాలు అధికంగా ఉంటాయని మూడీస్ తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed