బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నికర లాభం 28 శాతం క్షీణత!

by Harish |
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నికర లాభం 28 శాతం క్షీణత!
X

ముంబయి: 2019-20 ఆర్థిక సంవత్సరంలో మార్చిలో ముగిసిన చివరి త్రైమాసికంలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నికర లాభం 28.37 శాతం క్షీణించి రూ. 53.78 కోట్లకు చేరిందని వెల్లడించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ. 75.08 కోట్లుగా నమోదైంది. అలాగే, మొత్తం నిర్వహణ ఆదాయం 1.12 శాతం పెరిగి రూ. 2,806.33 కోట్లకు చేరింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికానికి రూ. 2,775.22 కోట్లుగా ఉంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి పరిశీలిస్తే..నికర లాభం రూ. 398.84 కోట్లుగా నమోదైంది. అంతకుముందు 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ. 4,763.25 కోట్ల నికర నష్టాలను నమోదు చేసింది. మొత్తం నిర్వహణ ఆదాయం 5.95 శాతం పెరిగి రూ. 11,495.53 కోట్లకు చేరుకుంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ ఆదాయం రూ. 10,849.68 కోట్లుగా ఉంది.

Advertisement

Next Story

Most Viewed