సిద్దిపేట జిల్లాలో బ్యాంకు క్యాషియర్‌కు కరోనా

by vinod kumar |
సిద్దిపేట జిల్లాలో బ్యాంకు క్యాషియర్‌కు కరోనా
X

దిశ, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. తాజాగా ఓ బ్యాంకు సిబ్బందిలో ఒకరు కరోనా బారిన పడ్డారు. కోహెడ మండలం బస్వాపూర్ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో క్యాషియర్‌‌కు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కొన్నిరోజుల నుంచి రుచి వాసన తెలియకపోవడంతో కరోనా పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లింది. తాజాగా శుక్రవారం వెలువడ్డ ఫలితాల్లో ఆమెకు పాజిటివ్ అని తేలింది. దీంతో బస్వాపూర్‌లో తెలంగాణ గ్రామీణ బ్యాంకును వెంటనే మూసివేశారు.

Advertisement

Next Story