- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ప్లీజ్ సేవ్ తెలుగు గర్ల్’.. బండ్ల గణేశ్ ట్వీట్..
దిశ, వెబ్‌డెస్క్: ‘ప్లీజ్ సేవ్ తెలుగు గర్ల్’ పేరుతో సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. పని కోసం గల్ఫ్ దేశానికి వెళ్లిన ఓ తెలుగు అమ్మాయి పడుతున్న ఇబ్బందులను కళ్లకు కట్టేలా ఉన్న ఓ వీడియోను ఆయన ట్విట్టర్‌లో పోస్టు చేశాడు.
https://twitter.com/ganeshbandla/status/1298297321696837633?s=20
‘ఎలాగైనా ఆ అమ్మాయిని కాపాడాలని కోరుతూ, రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, వైఎస్ జగన్, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్, రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ట్విట్టర్ అకౌంట్లకు’ ట్యాగ్ చేశాడు.
గల్ఫ్ కంట్రీలో ఉంటున్న దుర్గా రావు అనే తెలుగు వ్యక్తి ఆ వీడియోను బండ్ల గణేశ్‌కు షేర్ చేయగా, ఆయన రెండు రాష్ట్రాల సీఎంలు, మంత్రి కేటీఆర్, తెలంగాణ డీజీపీకి షేర్ చేశారు. ఈ వీడియాలో తెలుగు అమ్మాయిని ఓ మహిళా విచక్షణా రహితరంగా కర్రతో కొడుతున్న దృశ్యాలు, దెబ్బలు తాళలేక బాధితురాలు పెడుతున్న ఆర్తనాదాలు అందర్నీ కలిచివేస్తున్నాయి. కాగా, వీడియోపై తెలుగు రాష్ట్రాల సీఎంలు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాల్సిందే.