మార్కెట్ కమిటీ అధ్యక్షుడిగా బండి సారంగపాణి…?

by Shyam |   ( Updated:2021-08-23 22:04:22.0  )
మార్కెట్ కమిటీ అధ్యక్షుడిగా బండి సారంగపాణి…?
X

దిశ, పరకాల: పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ దాదాపుగా ఖరారైనట్లు విశ్వసనీయ సమాచారం. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గండ్ర జ్యోతిలు ఈ మేరకు ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. గత శనివారంతో ముగిసిన మార్కెట్ కమిటీ పాలకవర్గం స్థానంలో నూతన పాలక వర్గం నియమిస్తూ ఏ క్షణంలోనైనా ప్రకటన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు పరకాల మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ డైరెక్టర్లుగా పలువురి పేర్లు ఇప్పటికే ఖరారు అయ్యాయని తెలుస్తోంది.

పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా బండి సారంగపాణి (పరకాల టౌన్), వైస్ చైర్మన్‌గా మారేపల్లి నందం (శాయంపేట మండల కేంద్రం), డైరెక్టర్లుగా పూరెల్ల భాస్కర్ కౌకొండ నడికూడ మండలం, లక్ష్మీ బుచ్చిరెడ్డి(పరకాల మండలం వెల్లంపల్లి గ్రామం), రాసమల్ల రమేష్ (పరకాల మండలం మలక్కపేట), కొమురయ్య (నర్సక్క పల్లి గ్రామం), నిరంజన్ (లక్ష్మిపురం), ఆర్ఎంపి వైద్యుడు, బుర్ర రాజమౌళి గౌడ్ ( సీతారాంపురం), నక్క చిరంజీవి(పత్తిపాక)ల పేర్లు ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు మార్కెట్ కమిటీ పాలకవర్గ నియామక ఉత్తర్వులు వెలువడే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

Next Story