- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సంఘవిద్రోహ శక్తులకు అడ్డాగా పాతబస్తీ :బండి సంజయ్
దిశ, వెబ్‌డెస్క్: పాతబస్తీ సంఘ విద్రోహ శక్తులకు అడ్డాగా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. హైదరాబాద్‌లో చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మీ అమ్మవారిని బండి సంజయ్ దర్శించుకున్నారు. పార్టీ కార్పొరేటర్లతో కలిసి శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అవినీతికి పాల్పడనని.. అభివృద్ధికి తోడ్పడుతానని బీజేపీ కార్పొరేటర్లతో ప్రమాణం చేయించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత బండి సంజయ్ అమ్మవారికి మొక్కులు చెల్లించారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. నగర అభివృద్ధికి బీజేపీ తప్పకుండా సహకరిస్తుందని స్పష్టం చేశారు. కేంద్ర నుంచి నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఎంఐఎం, టీఆర్ఎస్ వియుక్త హైదరాబాద్‌ను సాధిస్తామన్నారు. పాతబస్తీ అభివృద్ధిపై కేసీఆర్‌ను ఒవైసీ ఎందుకు అడగడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ చేతగానితనం వల్లే హైదరాబాద్‌లో అభివృద్ధి ఆగిపోయిందన్నారు. కార్పొరేటర్ల కొనుగోళ్ల కోసమే మేయర్ ఎంపికను ఆలస్యం చేస్తున్నారని విమర్శించారు. తమ కార్పొరేటర్ల జోలికి వస్తే వంద మంది ఎమ్మెల్యేలను లాగుతామన్నారు.