బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర.. ముగింపు సభ ఎక్కడో తెలుసా..?

by Anukaran |   ( Updated:2021-09-29 11:04:21.0  )
bandi
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ హుస్నాబాద్‎లోనే నిర్వహించనున్నామని రాష్ట్ర ఉపాధ్యక్షుడు, పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ జి మనోహర్ రెడ్డి, సహ ప్రముఖ్‎లు టి.వీరేందర్ గౌడ్, లంకల దీపక్ రెడ్డిలు ప్రకటించారు. హుజురాబాద్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున కరీంనగర్ జిల్లా పరిధిలో ర్యాలీలు, భారీ బహిరంగ సభలపై నిషేధం ఉన్నందున.. వచ్చే నెల 2 వరకు సిద్దిపేట జిల్లాలోనే పాదయాత్రను కొనసాగిస్తామన్నారు. శుక్రవారం కోహెడ నుంచి ప్రారంభమయ్యే యాత్ర శ్రీరాములపల్లి, పర్వేద, పందిళ్ల మీదుగా పొట్లపల్లి వరకు సాగనుంది. తొలిదశ పాదయాత్ర ముగింపు సందర్భంగా అక్టోబర్ 2న హుస్నాబాద్ పట్టణంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story