దళిత బంధు ఎఫెక్ట్.. బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం

by Shyam |
దళిత బంధు ఎఫెక్ట్.. బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం
X

దిశ, అచ్చంపేట : సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ దిష్టిబొమ్మను నాగర్ కర్నూల్ జిల్లాలో దహనం చేశారు. అచ్చంపేట మున్సిపల్ కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మున్సిపల్ చైర్మన్ నరసింహ గౌడ్ ఆధ్వర్యంలో సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా నరసింహ గౌడ్ మాట్లాడుతూ.. దళిత బంధుకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్‌కు లెటర్ రాయడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీకి తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ఆయన హితవు పలికారు.

దళిత వ్యతిరేకి బీజేపీ పార్టీ..

జిల్లాలోని పదర మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో బిజెపి పార్టీపై నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎడమ జగపతి రాజు మాట్లాడుతూ.. ఎన్నికలతో సంబంధం లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత జనోద్ధరణకు ఆగస్టు 4న వాసాలమర్రిలో దళిత బంధు ప్రారంభించారని తెలిపారు. దళిత బంధు పథకాన్ని ఆపాలని బీజేపీ కుట్రపూరితంగా ఈసీకి ఫిర్యాదు చేయడం దుర్మార్గమని అన్నారు.

దీంతో బీజేపీ దళిత వ్యతిరేక పార్టీ అని తేలిపోయిందన్నారు. బీజేపీని హుజురాబాద్‌లో ఓడించాలని పిలుపునిస్తూ, యావత్ దళిత సమాజం కోరుకుంటోందని అన్నారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ గోలి శ్రీనివాసులు, డైరెక్టర్ రమేష్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు కొయ్యల వెంకటయ్య, గ్రామ అధ్యక్షులు నారయ్య, మాజీ సర్పంచ్ శ్రీను, యూత్ అధ్యక్షులు శరత్, దళిత సంఘాల నాయకులు మోహన్, అంజి, చంద్రయ్య, చిన్న రాయుడు, రాజు, తిరుపతి, శ్రీను, ప్రదీప్, మహేష్, తదితర నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story