- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
హుజురాబాద్‌లో ఈటలకు మరో షాక్.. రైట్ హ్యాండ్ రివర్స్
దిశ, హుజురాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు అత్యంత సన్నిహితునిగా ముద్రపడ్డ బండ శ్రీనివాస్ షాకిచ్చారు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న బండ శ్రీనివాస్ బుధవారం హుజురాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ… ప్రలోభాలకు గురై అమ్ముడు పోయే బిడ్డలం మాత్రం తాము కాదని స్పష్టం చేశారు. ఇంత కాలం మీతో కలిసి పనిచేసిన మాకు ఎన్ని డబ్బులు ఇచ్చారో వివరించాలని డిమాండ్ చేశారు. ఉద్యమంలో మీతో పాటు జైలుకు వచ్చిన తాము అభివృద్దితో పాటు అన్నింటా కలిసి పనిచేశాం.. కానీ ఏమైనా ఆశించామా అని ప్రశ్నించారు. ఈటల పార్టీ కోసం ఖర్చు పెట్టాడేమో కానీ, మా వ్యక్తిగత అవసరాల కోసం ఎప్పుడూ డబ్బులు ఇవ్వలేదన్నారు. అనంతరం మునిసిపల్ చైర్ పర్సన్ గందె రాధిక మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను చూసి ఇతర పార్టీల నాయకుల టీఆర్ఎస్ పార్టీలోకి వస్తుంటే ఈ పార్టీలోంచి తాము బయటకు వెల్లడం ఏంటన్నారు. ప్రలోభాలకు గురవుతున్నామని మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తాము అలాంటి నాయకులం కాదని స్పష్టం చేశారు.