ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అప్పటివరకు రద్దు!

by Shamantha N |
ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అప్పటివరకు రద్దు!
X

న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమాన సేవలపై నిషేధాన్ని కేంద్రం ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించింది. ‘అన్‌లాక్ 2’ దశ ఈ నెల 31దాకా కొనసాగనున్న సంగతి తెలిసిందే. అన్ని అంతర్జాతీయ విమాన సేవలపై నిషేధాన్ని ఈ నెల 31దాకా పొడిగించినట్టు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఓ ప్రకటనలో వెల్లడించింది. కార్గో, కొన్ని అనుమతి పొందిన విమానాలు మాత్రమే సేవలందిస్తాయని తెలిపింది. అయితే, కొన్ని ఎంపిక చేసిన మార్గాలలో అంతర్జాతీయ షెడ్యూల్స్ విమానాలను అనుమతించనున్నట్టు వివరించింది. కాగా, ఎయిర్ ఇండియా సహా పలు ప్రైవేటు సంస్థల విమానాలు వందే భారత్ మిషన్ కింద అన్‌షెడ్యూల్డ్ ప్రయాణాలు చేస్తున్నాయి. గతనెల 26న ఇంటర్నేషనల్ ఫ్లైట్స్‌పై బ్యాన్ ఈ నెల 15వరకు పొడిగించినట్టు డీజీసీఏ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed