సిక్కింలో విదేశీ పర్యాటకులపై నిషేధం

by Shamantha N |
సిక్కింలో విదేశీ పర్యాటకులపై నిషేధం
X

దేశంలో కరోనా వైరస్ అనుమానిత కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సిక్కిం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్రంలోకి విదేశీ పర్యాటకులు రాకుండ నిషేధం విధించింది. ఇప్పటికే గ్యాంగ్ టాక్, డార్జిలింగ్, నాథులా‌లో ఉన్న హోటల్స్‌లో విదేశీయులు చేసుకున్న బుకింగ్స్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో విదేశీయులపై నిషేధం విధించిన తొలి రాష్ట్రంగా సిక్కిం నిలిచింది. సాధరణంగా మార్చి, ఏప్రిల్ నెలల్లో సిక్కింలో విదేశీ పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో విదేశీ పర్యాటకులను తీసుకుని రావద్దని వివిధ టూర్ ఆపరేటర్లకు సైతం ఆదేశాలు జారీ అయ్యాయి. పర్మిట్ల జారీని సైతం నిషేధిస్తున్నామని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.

Tags: Sikkim govt, foreign tourists, ban

Advertisement

Next Story