- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
షర్మిలకు రాజకీయ అవగాహన లేదు : బాల్క సుమన్
దిశ, తెలంగాణ బ్యూరో : వైఎస్ షర్మిలకు రాజకీయ అవగాహన లేదని, ఆమె గురించి మాట్లడనని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడుతూ… షర్మిల తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానని చెబుతుందని అది కలేనని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా టీఆర్ఎస్ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని, తెలంగాణాను నీళ్లు-నిధులు-నియామకాల కోసం తెచ్చుకున్నామన్నారు. రెండు పంటలకు నీళ్లు అందిస్తూ రైతులకు తెరాస ప్రభుత్వం సంపూర్ణ న్యాయం చేస్తోందన్నారు.
నిధుల విషయంలో ఇప్పటికే ఉమ్మడి రాష్ట్ర బడ్జెట్ ను పెంచుతూ మన నిధులు మనమే వాడుకుంటున్నామని గుర్తు చేశారు. జోనల్ వ్యవస్థ ఫైల్ రాష్ట్రపతి దగ్గర ఉండటం వల్ల ఉద్యోగాల భర్తీ ఆలస్యమైందని, త్వరలోనే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగవంతం చేస్తామన్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో లక్షకు పైగా ఉద్యోగాలను టీఆర్ఎస్ ప్రభుత్వం భర్తీ చేసిందని, రానున్న రోజుల్లో ప్రభుత్వ- ప్రైవేట్ ఉద్యోగాల భర్తీ వేగంగా జరగనుందని ఆయన తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ఎక్కడ ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు.