- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈటలపై బాల్క సుమన్ హాట్ కామెంట్స్
దిశ, జమ్మికుంట: తల్లి లాంటి టీఆర్‌ఎస్ పార్టీని వీడి రైతులకు నల్ల చట్టాలు తెచ్చిన బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. సోమవారం హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని వీణవంక మండలంలోని దేశాయిపల్లి బి ఎస్ కే గార్డెన్ లో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ సోషల్ మీడియా సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన బాల్క సుమన్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రం అభివృద్ధిలో ముందుందని పేర్కొన్నారు.
హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు టీఆర్ఎస్ వైపు ఉన్నారని, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు తమ పార్టీలో చేరుతున్నారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలు పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తోందని మండిపడ్డారు. గ్రామాలలో బూతుస్థాయి నుండి మండల స్థాయి వరకు టీఆర్ఎస్ అభివృద్ధిపై ప్రచారం చేయాలని సూచించారు.