- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దళిత బిడ్డగా గర్వపడుతున్నా: ఎమ్మెల్యే బాల్క సుమన్
దిశ, కమలాపూర్: హుజరాబాద్ నియోజకవర్గంను దళిత బంధు పథకం పైలెట్ ప్రాజెక్టుగా ఎన్నుకున్నందుకు ఇక్కడి ప్రజలు అందరూ అదృష్టవంతులని బాల్క సుమన్ అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలోని కొత్తపల్లి, కన్నూరు, గుండెడు గ్రామాలలో మంగళవారం ఏర్పాటుచేసిన దళిత ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంకు ఎమ్మెల్యే బాల్క సుమన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భారతదేశంలో ఉన్న దళితులందరూ తన రక్త సంబంధికులేనని, దళితుడిగా గర్వపడుతున్నానని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో లేవని, దళితులందరూ టీఆర్‌ఎస్ వైపే ఉంటామంటూ వాడ, వాడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు. ఈనెల 16వ తేదీన హుజురాబాద్ శాలపల్లిలో జరిగే దళిత బంధు పథకంకు ముఖ్యమంత్రి హాజరుకానున్నారని, ఈ కార్యక్రమానికి అన్ని గ్రామాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని సభను విజయవంతం చేయవలసిందిగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో మండల ఇంచార్జ్ పెరియాల రవీందర్ రావు, ఆయా గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.