బజాజ్ నుంచి పల్సర్ సరికొత్త మోడల్

by Harish |
బజాజ్ నుంచి పల్సర్ సరికొత్త మోడల్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఆటో రంగ దిగ్గజం బజాజ్ ఆటో తన పల్సర్ 180 కొత్త వెర్షన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. దీని ధరను రూ. 1,07,904(ఎక్స్‌షోరూమ్-ఢిల్లీ)గా నిర్ణయించినట్టు బజాజ్ ఆటో మంగళవారం తెలిపింది. భారత మార్కెట్లో 20 శాతం ఉన్న స్పోర్ట్స్ బైక్ విభాగంలో ఎక్కువగా 180-200 సీసీ మోటార్ సైకిళ్లే ఉన్నాయని బజాజ్ ఆటో పేర్కొంది.

‘కొత్త పల్సర్ 180 అధునాతన సాంకేతికత కలిగి ఉంది. పనితీరులో ఉత్తమమైన స్పోర్ట్స్ బైక్‌ను వెతికే కస్టమర్లను లక్ష్యంగా ఇది వస్తోంది. దేశీయ మార్కెట్లో ఈ విభాగంలో లీడర్‌గా ఉన్న పల్సర్, 20 ఏళ్లుగా మరే ఇతర బైక్ దీన్ని పోటీ పడలేదని’ కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది. బ్లాక్ అలోయ్ వీల్స్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్, ఫ్రంట్ సస్పెన్షన్, 5-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ గేర్ బాక్స్, బ్యాక్ సస్పెన్షన్‌లో షాక్ అబ్జార్బర్ కలిగి ఉంటుందని కంపెనీ వివరించింది.

Advertisement

Next Story