ఆ నలుగురికి బెయిల్

by Shamantha N |
ఆ నలుగురికి బెయిల్
X

కోల్‌కతా: కేంద్ర దర్యాప్తు ఏజెన్సీ (సీబీఐ) సోమవారం ఉదయం అరెస్టు చేసిన ఇద్దరు బెంగాల్ రాష్ట్ర మంత్రులను, ఒక టీఎంసీ ఎమ్మెల్యే, మరో నేతకు కోల్‌కతాలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం బెయిల్ మంజూరుచేసింది. వీరిని అరెస్టు చేయగానే టీఎంసీ కార్యకర్తలు నేతలు కోల్‌కతాలోని సీబీఐ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. సీబీఐ అధికారులకు రక్షణగా ఉన్న కేంద్రబలగాలపైకి కొందరు రాళ్లను విసిరారు. అరెస్టుల గురించి తెలియగానే గంటలో సీఎం మమతా బెనర్జీ అక్కడకు చేరుకున్నారు. సుమారు ఆరు గంటలకుపైనే అక్కడే క్యాంప్ వేసుకుని నిరసనలు చేశారు. ఎట్టకేలకు సాయంత్రానికల్లా ఆ నలుగురికీ స్పెషల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాగా, సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మంజూరు చేసిన బెయిల్ ఆదేశాలను కలకత్తా హైకోర్టులో సవాల్ చేసే యోచనలో ఉన్నట్టు సీబీఐవర్గాలు తెలిపాయి.

Advertisement

Next Story

Most Viewed