- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘బాలికపై అత్యాచారం,హత్య చేసిన నిందితున్ని శిక్షించాలి’
దిశ, కొత్తగూడెం: హైదరాబాద్‌లో అభంశుభం తెలియని ఆరేళ్ళ గిరిజన బాలికపై అత్యాచారం, హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎర్రా కామేష్ డిమాండ్ చేశారు. ఆదివారం పార్టీ శ్రేణులతో కలిసి అంబేడ్కర్ సెంటర్‌లోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట కండ్లకు గంతలు కట్టుకొని, చేతుల్లో ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా కామేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బహుజనులపై దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయని వారికి రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఎస్పీ,ఎస్టీ కేసుల్లో బాధితులకు ఇవాల్సిన డబ్బులు కూడా ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని, ఎస్సీ, ఎస్టీ కేసులను అధికారులు నిర్వీర్యం చేస్తున్నారని, అధికారులు దీన్ని వ్యాపారంగా మల్చుకుంటు బాధితులకు న్యాయం చేయడం లేదన్నారు. జిల్లాలో ఎంతమంది దళితులకు మూడు ఎకరాల భూమిని పంపిణీ చేశారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. దళితులకు ఇవ్వడానికి లేని భూమి బడావ్యాపారులకు అమ్మడానికి మాత్రం వచ్చిందా, జిల్లా కేంద్రంలో ఎస్సీ కార్పొరేషన్‌కు సొంత భవనం కూడా లేక అద్దెకొంపలో ఉండాల్సిన పరిస్థితి నెలకొందని విమర్శించారు.