- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గోపీచంద్‌కు హోం క్వారంటైన్ ముద్ర
దిశ, న్యూస్‌బ్యూరో: ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్‌కు హోం క్వారంటైన్ ముద్ర వేశారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని రామాపురం చెక్‌పోస్టు వద్ద వైద్య పరీక్షలు నిర్వహించిన సిబ్బంది గోపీచంద్‌కు హోం క్వారంటైన్ ముద్ర వేశారు. దీంతో ఆయన 28రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండనున్నారు. ఈ విషయంపై తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది స్పందిస్తూ ఏపీ నుంచి తెలంగాణలోకి వచ్చే ప్రతి ప్రయాణికుడికి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూ హోం క్వారంటైన్ ముద్ర వేస్తున్నట్లు తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి సొంత రాష్ట్రాలకు చేరుకుంటున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించి, హోం క్వారంటైన్ విధించాలని కేంద్ర ప్రభుత్వం గతంలో మార్గదర్శకాలు జారీ చేసింది. దీనిలో భాగంగానే తెలంగాణ సరిహద్దుల వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్ద ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారికి హోం క్వారంటైన్ ముద్ర వేస్తున్నారు.