బ్యాడ్‌లోన్స్ భారీగా పెరిగే ప్రమాదముంది : ఫిచ్ రిపోర్ట్!

by Harish |
బ్యాడ్‌లోన్స్ భారీగా పెరిగే ప్రమాదముంది : ఫిచ్ రిపోర్ట్!
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఉపశమన చర్యల కారణంగా ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలో ఆస్తుల నాణ్యతలో సమస్యల ప్రక్రియను వాయిదా వేయడంతో 2022-23 ఆర్థిక సంవత్సరంలో బ్యాడ్ లోన్స్ గరిష్ఠ స్థాయికి చేరుకుంటాయని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. కొత్త బ్యాడ్ లోన్స్ తగ్గిపోవడం, అధిక స్థాయిలో రైటాఫ్ కారణంగా 2020-21లో భారతీయ బ్యాంకుల బ్యాడ్ లోన్స్ నిష్పత్తి ఊహించిన దానికంటే మెరుగ్గా 7.5 శాతంగా ఉందని ఫిచ్ వెల్లడించింది. కొవిడ్ ప్రభావానికి ఎక్కువగా గురైన ఎంఎస్ఎంఈ, రిటైల్ రంగాలకు ఎక్కువగా సహాయక చర్యలు ప్రకటించడంతో ఆస్తి నాణ్యతా సమస్యలను గుర్తించే ప్రక్రియ వాయిదా పడేందుకు కారణమని ‘ఇండియన్ బ్యాంక్స్-2021 రిపోర్ట్ కార్డ్’ పేరుతో ఫిచ్ రేటింగ్స్ రూపొందించిన నివేదిక అభిప్రాయపడింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల కంటే ప్రైవేట్ రంగ బ్యాంకులు మెరుగైన పనితీరుని కనబర్చడంతో బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తంగా సానుకూలంగా ప్రభావితమవుతోంది. అయితే, ఇటీవల కరోనా సెకెండ్ వేవ్ వల్ల దేశీయ బ్యాంకులు ఎదుర్కొంటున్న సవాళ్లు పెరిగాయి. నియంత్రణ కోసం విధించిన కఠిన ఆంక్షలతో రికవరీ ప్రయత్నాలు మందగించాయని నివేదిక వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed