- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించం..
దిశ, నిజాంపేట్: తప్పుడు పత్రాలు చూపిస్తూ సుమారు ఎ.4.19 గుంటలు ప్రభుత్వ భూమిని కాపాడిన సంఘటన శుక్రవారం బాచుపల్లి మండలం నిజాంపేట్ సర్వే నెంబర్ 233/1 లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. నిజాంపేట్ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ప్రభుత్వ భూమిని అసైన్డ్ పట్టా సాకుతో కోర్టును తప్పు దోవ పట్టిస్తూ కబ్జాకు పూనుకున్నారు. గతంలో మేడ్చల్ జిల్లా కలెక్టర్ 233/1 లోని ప్రభుత్వ భూమి ఎ.04:19 గుంటలు నిజాంపేట్ మున్సిపల్ కార్యాలయం, బాచుపల్లి తహసీల్దార్ కార్యాలయానికి కేటాయించారు. అయితే తప్పుడు డాక్యుమెంట్స్ సృష్టించి నిజాంపేట్‌లో కొందరు కబ్జారాయుళ్లు వందల కోట్ల ప్రభుత్వ భూమిని కాజేసేందుకు పన్నాగం పన్నారు.
దీంతో కబ్జా విషయాన్ని పసిగట్టిన అప్పటి మున్సిపల్ కమిషనర్ గోపి పోలీస్ బందోబస్తు తో ఆక్రమణలు తొలగించారు. అయితే వరంగల్ కలెక్టర్‌గా నిజాంపేట్ కమిషనర్ గోపి బదిలీ అనంతరం 233/1 లోని ప్రభుత్వ భూమిని మళ్లీ కబ్జా కథతో తమ ఆధీనంలో చేసుకున్నారు. ఈ మేరకు తరచుగా ఫిర్యాదులు రావడంతో మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు ఆక్రమణలు తొలగించారు. ప్రభుత్వ భూమిలో వెలసిన మూడు షెడ్లు, రెండు గదులును అధికారులు కూల్చి వేశారు. అనంతరం రెవెన్యూ అధికారులు సర్వే చేసి నిజాంపేట్ మున్సిపల్ అధికారులకు హ్యాండోవర్ చేశారు. ఈ సందర్భంగా బాచుపల్లి తహసీల్దార్ సరిత మాట్లాడుతూ.. కబ్జాలకు పాల్పడితే ఎంతటి వారినైనా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. కూల్చివేతలల్లో ఏసీపీ శ్రీనివాస రావు, ఆర్ ఐ శ్రీదేవి, టౌన్ ప్లానింగ్ అధికారి పావని, సర్వేయర్ శ్రీనాథ్, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.