- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కెరీర్ బెస్ట్ రేటింగ్ పాయింట్లు సాధించిన బాబర్ ఆజమ్
దిశ, స్పోర్ట్స్: పాకిస్తాన్ కెప్టెన్, బ్యాట్స్‌మాన్ బాబర్ ఆజమ్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో కెరీర్ బెస్ట్ రేటింగ్స్ సాధించాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో సెంచరీతో అదరగొట్టిన బాబర్ అజమ్ మ్యాచ్ మాత్రం గెలిపించలేకపోయాడు. ఈ క్రమంలో 873 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇక టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (857) రెండో స్థానానికి పడపోయాడు. ఓపెనర్ రోహిత్ శర్మ 825 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో రాస్ టేలర్, ఆరోన్ ఫించ్ కొనసాగుతున్నారు. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో తబ్రిజ్ శంషీ (821), రషీద్ ఖాన్ (719) తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇంగ్లాండ్ బౌలర్ ఆదిల్ రషీద్ ఒక స్థానం పెంచుకొని మూడో స్థానంలో, శ్రీలంక బౌలర్ వానిందు డిసిల్వ నాలుగో స్థానానాకి చేరుకున్నాడు.
బ్యాటింగ్ ర్యాంకింగ్స్:
1. బాబర్ ఆజమ్ (873)
2. విరాట్ కోహ్లీ (857)
3. రోహిత్ శర్మ (825)
4. రాస్ టేలర్ (801)
5. ఆరోన్ ఫించ్ (791)
6. జానీ బెయిర్‌స్టో (775)
7. డేవిడ్ వార్నర్ (773)
7. షాయ్ హోప్ (773)
9. ఫ్రాంకోసిస్ డు ప్లెసిస్ (770)
10. కేన్ విలియమ్‌సన్ (754)