అన్నదమ్ముల మధ్య ఘర్షణ.. తమ్ముడి దారుణ హత్య

by Sumithra |
అన్నదమ్ముల మధ్య ఘర్షణ.. తమ్ముడి దారుణ హత్య
X

దిశ, వెబ్‌డెస్క్ : సూర్యాపేట జిల్లాలో దారుణం జరిగింది. అన్నదమ్ముల మధ్య తలెత్తిన వివాదం తమ్ముడి హత్యకు దారి తీసింది. ఈ ఘటన జిల్లాలోని నూతనకల్ మండలం టిక్యా తండాలో సోమవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకివెళితే.. ఇంటి నిర్మాణ విషయంలో అన్నదమ్ములిద్దరికీ గొడవ తలెత్తగా సొంత చిన్నాన్నను అన్న కొడుకులు దారుణంగా కొట్టి చంపారు. ఇది స్థానికంగా కలకలం రేపింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించారు.

Advertisement

Next Story