- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
2021 కూడా వినాశనమేనా? వంగ మాటల్లో నిజమెంత?
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా గురించి ఏనాడో వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పాడని మనం అనుకుంటున్నట్లే.. బల్గేరియాకు చెందిన ‘బాబా వంగ’ కూడా భవిష్యత్తును ముందే చెప్పేసింది. అంతేకాదు తను చెప్పినవాటిలో కొన్ని జరుగుతున్నాయి కూడా. టోర్నడో వల్ల 12 ఏళ్లకే చూపు కోల్పోయిన వంగ.. ఆ తర్వాతి కాలంలో కాలజ్ఞానం చెప్పడం మొదలుపెట్టింది. ఆమె చెప్పినవి జరగడంతో, తనను బల్గేరియాలో నోస్ట్రడామస్(ఫ్రెంచ్ కాలజ్ఞాని)తో సమానంగా చూసేవారు. ఆమె ఎన్నో విపత్తులు, వైపరీత్యాలను ముందుగానే చెప్పేయగా, తాజాగా 2021లో జరగబోయేవాటి గురించి తెలిపింది.
బాబా వంగ కాలజ్ఞానం ప్రకారం 2021 ఏమాత్రం ఆనందకరంగా ఉండదట. తను 5079 వరకు భవిష్యత్తును అంచనా వేయగా.. యువరాణి డయానా మరణం, అమెరికాలో సెప్టెంబర్ 11 దాడులు, చెర్నోబిల్ అణు ప్రమాదం, పుతిన్‌పై హత్యాయత్నం, అమెరికా అధ్యక్షుడు చావు అంచుల దాకా వెళ్తాడనడం.. ఇలా అన్నీ జరిగాయి. ఇక 2021లో కేన్సర్‌కు మందు లభిస్తుందని వివరించగా, ఈ ప్రపంచాన్నంతటినీ ఓ డ్రాగన్ తన గుప్పిట్లోకి తీసుకుంటుందని ఆమె తన కాలజ్ఞానంలో చెప్పింది. అయితే ఫ్రాన్స్ జ్యోతిష్కుడు, తత్వవేత్త అయిన నోస్ట్రడామస్ కూడా 2021 మరింత వినాశకరంగా ఉంటుందనీ, భూకంపాలు వస్తాయని చెప్పాడు. అయితే వంగ బాబా రాతపూర్వకంగా స్వయంగా ఏదీ రాయలేకపోవడంతో, ఆమె చెప్పిన వాటిలో చాలా వరకూ కల్పించినవేనని కొందరి వాదన. కొందరు మాత్రం ఆమె చెప్పినవన్నీ జరిగినపుడు, ఇవి మాత్రం ఎందుకు జరగవని అభిప్రాయపడుతున్నారు. కాగా బాబా వంగ 1996లో మరణించింది.