కోహ్లీ, రోహిత్‌లు ఆడకపోవడం ఆశ్యర్యం వేస్తోంది: అజారుద్దీన్

by Shyam |
azaruddin
X

దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియాలో జరుగుతున్న పరిణామాలపై మాజీ కెప్టెన్, హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ ఘాటుగా స్పందించారు. కీలకమైన దక్షిణాఫ్రికా పర్యటనలో టెస్టు సిరీస్‌లో రోహిత్ ఆడకపోవడం, వన్డే సిరీస్‌లో కోహ్లీ ఆడకపోవడం తనను చాలా ఆశ్చర్యానికి గురిచేసిందని అన్నాడు. ఇలాంటి విషయాలు జట్టులో విభేదాలు ఉన్నాయనే అనుమానాలను కలిగిస్తాయని అజార్ అన్నాడు. తీరిక లేని క్రికెట్ ఆడుతున్న సమయంలో ఏ క్రికెటర్ అయినా విశ్రాంతి తీసుకోవాలని భావిస్తాడు. కానీ అలాంటి నిర్ణయం తీసుకోవడానికి కూడా తగిన సమయం చూసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న తప్పులే జట్టులో లుకలుకలను బయటపడేస్తాయని అజారుద్దీన్ అభిప్రాయపడ్డాడు. కాగా, ప్రతీ జట్టులోనూ ఇలాంటి సమస్యలు ఉంటాయి. కానీ జట్టు యాజమాన్యం వీటిని పరిష్కరించాలి. అప్పటికీ కుదరకపోతే తప్పకుండా ఇద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడాలని మాజీ క్రికెటర్లు కూడా సూచిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed