- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నన్ను పెళ్లి కొడుకును చేయండి బాబాయ్.. సీఎం యోగికి లేఖ
దిశ,వెబ్‌డెస్క్: పెళ్లి కాని ప్రసాదులు పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఆలసించిన ఆశాభంగం. మంచి ముమూర్తం మళ్లీ రాదు. ఇప్పుడు కాకపోతే మరికొన్ని నెలలు వెయిట్ చేయాల్సిందేనంటూ తెగ హడావిడి చేస్తున్నారు. హంగులు, ఆర్భాటాలు లేకుండా ఓ మంచి ముహూర్తంలో మమ అనిపించేస్తే ఓ పనైపోతుందని, పైగా మే నెల నుంచి మంచి ముహుర్తాలు కూడా ఉన్నాయంటూ పెళ్లి కాని ప్రసాద్ లు పెళ్లి పీఠలు ఎక్కేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. కానీ 30లు దాటుతున్నా పెళ్లి భాగ్యానికి నోచుకోని యువకులు ఆ మ్యారేజ్ బ్యూరో, ఈ మ్యారేజ్ బ్యూరో అంటూ తెగ కష్టపడుతున్నారు. అయినా పెళ్లి అయ్యే భాగ్యం లేకపోతే ఇలా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు.
ఉత్తర్ ప్రదేశ్ షామ్లీ జిల్లాకు చెందిన 26ఏళ్ల యువకుడు కైరానా పోలీసుల్ని ఆశ్రయించారు. ఆరుగురు అన్నదమ్ముల్లో మూడో వాడైన అజీమ్ మన్సూరికి పెళ్లి కావడం లేదు. అందుకు కారణం అతని ఎత్తు 3 అడుగుల 2 అంగుళాలు. దీంతో అతన్ని పెళ్లి చేసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో తనకు పెళ్లి చేసుకోవాలని, ఓ మంచి అమ్మాయిని చూసి పెట్టాలంటూ తన అన్నదమ్ములతో కలిసి స్టేషన్ కు వచ్చారు. అమ్మాయి ఎలా ఉన్న పర్వాలదేని, కానీ చదువుకుని ఉండాలని షరతు విధించాడు.
కైరానా పోలీస్ స్టేషన్ పరిధిలోని మొహల్లా జంట బావి సమీపంలో నివసించే మన్సూరి ఇప్పటికే తనకి పెళ్లి చేయాలని కోరుతూ డీఎం, ఎస్‌డీఎం, రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో పాటూ పలువురు ఉన్నతాధికారులకు దరఖాస్తులు సమర్పించినట్లు చెప్పాడు. కానీ ఇంత వరకు తన గురించి ఎవరూ పట్టించుకోలేదని, అందుకే పోలీసుల్ని ఆశ్రయించినట్లు చెప్పాడు. అయితే మన్సారి కోరిక మేరక అమ్మాయి దొరికితే తామే దగ్గరుండి పెళ్లి చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. పెళ్లైన వెంటనే తన భార్యను హనీమూన్ ట్రిప్ కోసం మనాలీ, గోవా, సిమ్లాకి తీసుకెళతానని సిగ్గుపడుతూ చెప్తున్నాడు.