అంగరంగ వైభవంగా అయ్యప్ప పడిపూజ..

by Shyam |   ( Updated:2021-12-05 10:57:41.0  )
అంగరంగ వైభవంగా అయ్యప్ప పడిపూజ..
X

దిశ, జల్​పల్లి: శ్రీ అయ్యప్ప స్వామి శరణు గోషతో నాదర్​గూల్ గ్రామం మారుమ్రోగింది. బడంగ్​పేట్ మున్సిపల్ కార్పొరేషన్​ పరిధిలోని నాదర్​గూల్ తోట ఎట్టారెడ్డి గార్డెన్​లో18వ శ్రీ అయ్యప్ప స్వామి మహాపడి పూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. భజనమండలి గంగపుత్ర నర్సింగ్​రావు గురుస్వామి ఆధ్వర్యంలో ఆలపించిన భక్తి గీతాలు పలువురిని విశేషంగా ఆకట్టుకున్నాయి.

శ్రీ అయ్యప్ప స్వామి మహాపడి పూజకు రాష్ట్ర విద్యాశాఖా మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి, బడంగ్​పేట్​ మున్సిపల్​ కార్పొరేషన్​ మేయర్​ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్​చార్జి అందెల శ్రీరాములు యాదవ్​, బీజేపీ సీనియర్​ నాయకులు కొలను శంకర్​ రెడ్డి, బ్రహ్మశ్రీ యు.రామచంద్రన్ నాయర్​ గురుస్వామి, పాలుబాయి అశోక్​ గురుస్వామి, మర్రినర్సింహారెడ్డి, తిరుపెల్లి సుధాకర్​ యాదవ్​, యాతం భిక్షపతి యాదవ్​ గురుస్వాములతో పాటు వందలాది మంది శ్రీ అయ్యప్ప స్వామి భక్తులు పాల్గొని, స్వామి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

Advertisement

Next Story